Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1 వ చరణం..
అర్చ్య శిష్ట మన స్లీవ స్వరూపమున
కర్థ మెరుగవలెరా క్రీస్తువుడా అర్థ మెరుగవలెరా
అర్ధ మెరిగి యది వ్యర్థ మనక మన కర్త చేరవలెరా llఅర్చ్యll
2వ చరణం..
కర్త తిరుశిర మందలి గాయముల
కదసి చూడవలెరా క్రీస్తువుడా కదసి చూడవలెరా
ముండ్ల కిరీటము సుత్తియ దెబ్బల్
మొనసి దెలియ వలెరా llఅర్చ్యll
3 వ చరణం..
ఎడమ చేతిలో మన కర్త గాయము
నెంచి వేడవలెరా క్రీస్తువుడా నెంచి వేడవలెరా
ఎంచి చూచి మన పాప పుంజము
ద్రుంచి వేయవలెరా llఅర్చ్యll
4వ చరణం..
కుడి చేతిలో మన కర్త గాయముల
కూర్మి వేడవలెరా క్రీస్తువుడా కూర్మి వేడవలెరా
కూడియున్న మన కోటి పాపముల
కూలద్రోయవలెరా llఅర్చ్యll
5 వ చరణం..
తిరు పాపముల రెండు గాయముల
తీరు చూడవలెరా క్రీస్తువుడా తీరు చూడవలెరా
అధిక ముఖమున ముద్దు చేయుచు
నాత్మ నెంచవలెరా llఅర్చ్యll