Type Here to Get Search Results !

అందాల తారక క్రిస్మస్ | Andala taraka christmas song | Telugu christmas songs


అందాల తారక క్రిస్మస్

Andala taraka christmas song | Telugu christmas songs

పల్లవి 

అందాల తారక క్రిస్మస్

ఆనందాల వేడుక క్రిస్మస్ ||2|| 

పాపికి రక్షణ క్రిస్మస్ - క్రిస్మస్

పాప క్షమాపణ క్రిస్మస్ క్రిస్మస్ ||2||అ|| 


1 వ చరణం.. 

వేదన యందున వెలుగును చూపే

వెలుగు తారక క్రిస్మస్ 

శోధనే యందున శోకము బాపె

శుభముల తారక క్రిస్మస్ ||2|| 

దీనుల బ్రతుకున దీవెన లిచ్చె 

దయగల తారక క్రిస్మస్ 

పశువుల పాకల పసిడి కాంతుల

పరలోక వరముల క్రిస్మస్ ||అ|| 


2 వ చరణం.. 

విరిగిన మనసున మమతను పంచె

మమతల తారక క్రిస్మస్ 

బెదరిన గుండెకు అభయము నొసగే

అభయ తారక క్రిస్మస్ ||2|| 

నిరాశలో హృదిలో ఆశలు చూపే 

ఆశల తారక క్రిస్మస్ 

దివిలో మహిమను భువిలో పంచిన 

దైవీక వరముల క్రిస్మస్ ||అ||




Document

Your download link will appear in 10 seconds.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section