Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 6
దేవుని ప్రేమను మరువకుము
ఆయన మేలును మరువకుము
ఆయన హృదయము ...కరుణా నిలయం
ప్రేమించుటయే.... ప్రభు నైజం
హల్లెలయా....హల్లెలయా......
1 వ చరణం..
పాపం బాపును...క్షమనే చూపును
వ్యాధులను మాన్పును... జీవం పోయును
ఆ జాలి హృదయం....సంజీవ నిలయం
ప్రేమించు దైవం....బలమైన నామం
2 వ చరణం..
భారం మోయును.... శ్రమలను ఓర్చును
ప్రేమను పంచును.... సేవలు చేయును
ఆరాధ్య సదనం..... సంపూర్ణ జీవం
మనుజాలి కోసం....జీవించు దైవం