Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Manoj Kumar
Album: జీవశృతి - 8
పల్లవి:
దివినేలు రాణీ ఓ దేవమాతా
సౌజన్యమూర్తీ మా మేరి మాతా
అ.ప. : నీవే మాకు భువిలో ఇలవేల్పు తల్లి
నీ శాంతి హృదిలో ఓదార్చుమమ్మా
1 వ చరణం..
వినయశీల కన్య నీవు సుగుణశీలి దీప్తివి నీవు
ఇదిగో దైవ దాసినంటు విధేయించినావు
ఆదర్శమాతవు నీవు మానవాళి ఆశ నీవు
మా శోక భారములన్నీ తొలగించుమమ్మా
2 వ చరణం..
కరుణజూపు తల్లి నీవు మమతలలొలుకు ప్రేమ నీవు
తరతరాల ధన్యనంటూ సంతసించినావు
ఆర్తజనుల రాజ్ఞివి నీవు ఆనంద జ్యోతివి నీవు
మా హృదయ పీఠమునందు వెలుగొందుమమ్మా