Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ద్రాక్షావల్లివి నీవే ప్రభువా!
ద్రాక్షారెమ్మను నేనో ప్రభువా
దారిని తప్పక నుండనో ప్రభువా
త్రోవను చూపుము నాకో ప్రభువా ||ద్రా||
1. ధర్మ బోధన నీదే ప్రభువా
దీన జనుడను నేనో ప్రభువా
దరికి చేర్చుము నను నో ప్రభువా
దానవుండను గాక నో ప్రభువా ||ద్రా||
2. జీవజలముల నిమ్మో ప్రభువా
జారనియ్యకు - నను ఓ ప్రభువా
జీవముండెను-నీలో ప్రభువా
జీవితునిగా-చేయుము ప్రభువా ||ద్రా||
3. సత్యదేవుడ - నీవే ప్రభువా
నిత్యజీవము - నిమ్మో ప్రభువా
నిత్యజ్యోతివి - నీవే ప్రభువా
సత్యమార్గము -చూపుమో ప్రభువా ||ద్రా||