Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
మహోన్నత దైవమా - మా నవ జీవమా
నీ మధురగానమే - ఇలలో నినదించులే
1. చిట్టిపాపలు పసికూనలు నిన్నే కీర్తింతురు
సూర్యచంద్రులు జీవరాశులు
నిన్నే వినుతింతురు - ||మహోన్నత||
2. వన్యప్రాణులు వాగువంకలు
నిన్నే పూజించును
సాగర మందలి జలచరాలు
నిన్నే ప్రణుతించును ||మహోన్నత||
3. నీవు మలచిన మానవజాతి
నీ స్తుతి పాడెదరు
పరవశించగా ఆ దివి దూతలు
నీ కృతి మీటెదరు ||మహోన్నత||