Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 4
మధురమైన యేసు ప్రేమ గలము విప్పి పాడేద
సాటిలేని క్రీస్తు ప్రేమ లోకమంతా చాటెద
శాంతి దూత....యేసు వాక్యం
అమరమైన....ప్రేమ గీతం
1 వ చరణం..
అంధకార జీవితాన...నవ్య వెలుగు యేసువు
ఆశలేని బ్రతుకులోన...నవ్య జీవం యేసువు
పతన మొందిన జీవితాలకు... ముక్తినోసగే దైవము
2 వ చరణం..
దిక్కు తోచని బ్రతుకులోన... సత్య మార్గం యేసువు
వేదనలలో శ్రమలలోన...ఊరడించు యేసువు
అర్త జనుల ఆత్మదాహం...తీర్పు నిత్య జీవము