Lyrics/Tune/Music: : Koka Joseph Ranjith
Album: పరిశుద్ధుడు
ప: మధురమైన నీ నామము
మనసారా సుతియింతును ||2||
మనసు నెరిగిన నా ఏసయ్యా ||2||
మమతపంచగ రావేమయ్యా ||2||
యేసయ్యా యేసయ్య
యేసయ్యా యేసయ్య ||2|| ||మ||
1. నా ఆశ్రయదుర్గము నీవే ఆశ్చర్యకర్తవు నీవే
నాకున్న బలము నీవే-ఆదరణ కర్తవు నీవే ||2||
నీరెక్కల చాటున ననుదాచుకోదేవా ||2||
నీదూతల కాపుదలలో
దాటించుము నాత్రోవ ||2|| ||మ||
2 నీ నామస్మరణము చేయ
నా తనువుపులకించు ||2||
నీ వాక్యము పాటించగా
జీవితము తరియించు ||2||
నిన్నాశ్రయించగా
శాంతినొందు ఈ జగతి ||2||
నిన్ను ఆనుసరించగా
మాకు దొరుకు నీశాంతి ||2|| ||మ||