Lyrics: Fr. Vincent
Tune: Fr. Vincent
Music: unknown
Album: సంగమం-3
మాట్లాడుమో ఓ మహా ప్రభూ
ఆలకించుచున్నాము ||2||
నేనయ్యా నీ దాసుడను
వేచియున్నాను నీ కోసం
మధురం మధురం నీ వాక్యం
నా త్రోవకు దీపం నీ వాక్యం ||2|| ||మాట్లా||
1. నీ శుభవచనం ప్రతిదినం
నే విని జీవం పొందాలి ||2||
యేసయ్యా నా ఆత్మీయ కన్నులను
నిరంతరం తెరువుమయా ||2||
మధురం మధురం నీ వాక్యం
నా త్రోవకు దీపం నీ వాక్యం ||2|| ||మాట్లా||
2. వేదములోని రహస్యములన్ని నాకు నేర్పించ ||2||
యేసయ్యా నా ఆత్మీయ కన్నులను
నిరంతరం తెరువుమయా ||2||
మధురం మధురం నీ వాక్యం
నా త్రోవకు దీపం నీ వాక్యం ||2|| ||మాట్లా||