Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నడిపించు నానావ నడి సాంద్రమున దేవా
నవ జీవన మార్గమున - నా జన్మ తరియింప
1. నా జీవిత తీరమున నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము - నా సేవ చేకొనుము
2. రాత్రంతయు శ్రమ పడిన - రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకినను - రాదాయెను ప్రతి ఫలము
రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవ
3. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి
ఆశానిరాశాయే ఆవేదనెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని అల్లాడె నా వలలు
4. ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని
ప్రాపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది
ఫల హీనుడవై ఇపుడు పాటింతు నీ మాట
5. లోతైన జలములలో - లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
లోపించని యార్పణగా లోకేశ చేయుమయా
6. ప్రభుయేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో పరిశుధ్ధుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము జేతుllనడిll