Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప|| నేనే జీవాహారం...నేనే మధురాహారం
నను భుజించువాడు నిత్య జీవము పొందును
అంతిమ దినమున లేచును
రండి ప్రియులారా లోకొన రారండి
రండీ స్నేహితులారా జీవముపొందగ రండి
||నేనే||
1. ఇదిగో నా శరీరం ఇదిగో నా రక్తం - ||2||
భక్తితో లోకాన పరుగున రండి
పరలోక విందు ఇది
నా ప్రియమైన విందు ఇది
||రండి ప్రియులారా|| ||నేనే||
2. మన్నాను భుజియించి మరణించిరి
నను భుజియించిన మీరు జీవింతురు
దివి నుండి వచ్చిన ఆత్మకు భోజ్యం
పరలోక విందు ఇది
నా ప్రియమైన విందు ఇది
||రండి ప్రియులారా|| ||నేనే||