Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి: నీకు మారుగా నన్ను మలచిన
శాశ్వత స్నేహితుడా నా ప్రియహిత
సుతుడా శాశ్వత స్నేహితుడా
ప. నీకు మారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా
ఆత్మ ఆలనతో ఆదరించిన-నా ప్రియ హితసుతుడా
పూజలు గైకొనుమా దయతో ననుగనుమా
1. నీవు లేక నే లేనే లేనని - తలచిన శుభ సమయాన
పూజా వేళలో నీ సన్నిధిలో- తరింప చేరితి స్వామీ ||2||
స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థన - ||పూజలు||
2. పేరుతో నన్ను పిలిచిన వేళ - నీతో నడిచితి దేవా
కొదువలేని నీ ప్రేమను పొంది - యాజక భాగ్యము నొందితిని ||2||
స్వీకరించు దయతో - నా స్తుతి ప్రార్ధన ||పూజలు||