Lyrics: unknown
Tune: Fr. David N
Music: Naveen M
Album: నీ పదసేవలో- 1
ప. నీ పద సేవలో నీ పాద పూజలో
పరవశమొందగ వచ్చాను స్వామి ||2||
ప్రియమారగా కొనియాడగా ||2||
అరుదెంచినామయ్య - ఆత్మదేవా ||నీ||
1. అరుణోదయ వేళ తొలికిరణాలే
దీపారాధన చేయగా
మదిపులకించే మలయమారుతమే
వింజామరలు వీయగ ||2||
విరిసిన హృదయాలతో
ముకుళిత హస్తాలతో ||2||
నీ పూజలు చేయగ వచ్చాము స్వామీ ||నీ||
2. తల్లి గర్భములో రూపొందకమునుపే
సేవకు ఎన్నుకొని పిలువగ ఆ.... ||2||
తను మన యాత్మల అర్పణ చేసి శుభ
హారతులతో అరయగ ||2||
పరిశుద్ధాత్మతో అభిషేకించగ ||2||
నీ అర్చన చేయగ వచ్చాము స్వామీ ||నీ||