Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
నేడే ప్రియరాగం - పలికే నవగీతం
ప్రేమే మనకోసం వెలిసే...
లోకాన శాంతి మురిసింది.. మన మనసుల్లో
రాగాల కాంతి విరిసింది
1. దివినేలు దేవుడు ఉదయించగానే
ఇలలోన ప్రకృతి పులకించెగా
పరలోక దూతలు స్తుతియించగానే
జగమంత ఉప్పొంగి నర్తించెగా ||నేడే ప్రియరాగం||
2. మనిషైన సుతుడు జనియించగానే
విశ్వాన గోళాలు విభవించెగా
చిన్నారి యేసుని చిరునవ్వుతోనే
నవకాంతి లోకాల ప్రభవించెగా ||నేడే ప్రియరాగం||