Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
నివసించుము నాలో ఆత్మా !
సదాకాలము దేవుని ఆత్మా ! నివసించుము
1 వ చరణం..
మనస్సును శుద్ధిచేసి
హృదయాన్ని కడిగేసి
చింతలను తీసివేసి
జీవితాన్ని బాగుచేసిllనివll
2 వ చరణం..
కన్నులకు దృష్టినిచ్చి
నాలుకకు మాటలిచ్చి
చెవులకు వినికిడినిచ్చి
జ్ఞానముతో నన్ను నింపిllనివll
3 వ చరణం..
చేతులకు శక్తినొసగి
పనులలో తృప్తినొసగి
జీవముతో నన్ను నింపి
జీవితాన్ని నిత్యం నడుపుతుllనివll