Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పాపము బాపెడి - పాపుల పాలి
దయ కనికరములు - గల దాతా దేవాllపాపముll
1 వ చరణం..
అప్పరసములను - వినయముగాను
అర్పణ జేతుము - ఆచార్యుండ
తప్పులు బాపుమొ - యార్పణలోన ||2||
దయ కనికరములు - గల దాతా దేవా
2 వ చరణం..
సకలము నీకిల - నిచ్చెదమయ్యా
సామ్రాజ్యమ్ముల - గాచెడి దాత ||2||
గైకొనుమా - మా యర్పణ నేడు
దయ కనికరములు - గల దాతా దేవాllపాపముll
3 వ చరణం..
పరిశుద్ధుడవగు - పావన దేవా
పరమును జూపుమొ - పాపుల పాలి
పరి పరి విధముల - ప్రణతులు జేతు ||2||
దయ కనికరములు గల - దాతా దేవాllపాపముll