Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పాపాల ఊబిలో పడిపోయి ఉన్నాను
పరితాప హృదయంతో ప్రణమిల్లుచున్నాను
ఓ ప్ర దయచూపవా
1. నీ ప్రేమనే వీడి నిను మరచిపోయాను
పావనుడా నను కరుణించరావా
కన్నీటితో నీ పదద్వయమును -
నే కడిగెదను ఓ స్వామి
పన్నీటితో నా హృది కోవెలను -
శుద్ది చేయుము స్వామి
2.. శాపాల భారంతో అలసిపోతిని -
ఆదరించే దేవా ఆదుకొనగరావా
నాదు పాపాలు మన్నించి -
నా శాపం బాపుము దేవా
జీవిత దీపం వెలిగించి -
నీ దరి చేర్చుము దేవా