Lyrics/Tune: Joseph Kancharla
Music: Naveen M
Album: నీపద సేవలో-2
ప: పాపిని యేసయ్యా నేను పాపిని యేసయా... ||2||
నీ సన్నిధిలో నిలుచుటకు అర్హుడను కానయా
నీ నామమును పలుకుటకు యోగ్యత లేదయా
నీ కరుణతో నన్ను క్షమించుము
నా దోషములన్ని మన్నించుము ||2||
1. పేతురును పోలి పలుమార్లు బొంకితి.
దుడుకు వాని వలే దూరముగా వెళ్ళితి ||2||
ఈ లోక ఆశలు వ్యర్థమని
ఈ లోక సిరులన్ని శూన్యమని ||2||
నేడు నేను తెలుసుకొని
నీ సన్నిధి నేను చేరితిని
2. వివేకములేని కన్యకగా నడిచితి
దావీదువలే మోహములో మునిగితి ||2||
ఈ క్షణిక సుఖములు శూన్యమని
నా కున్న సౌందర్యం మట్టిదని ||2||
నేడు నేను తెలుసుకొని
నీ సన్నిధి నేను చేరితిని ||నీ||