Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పాపిని యేసయ్యా నన్ను మన్నించవా -
దోషిని నేనయ్యా నాపై దయచూపవా
నీవే నా ఆశ్రయ దుర్గం నీవే నా రక్షణ కోట -
నీవే నా జీవన ఊట
1. కృపను చూపు దేవుడవు నీవేనయ్యా -
మన్నించే ప్రియ తండ్రివి నీవే నయ్యా
కోపము లేని దేవుడవని నమ్మి -
నీ దాపు చేరాను మన్నించవా
2. పాపమనే లోయలో పడిపోతిని.-
నీ దివ్య వాస్తవమును అందించుమా
నీ అరచేతిలో నన్నుంచుకొని -
అన్ని వేళలా నన్ను కాపాడుమా