Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పాపిని ప్రభువా - నజరేయవాసా
నిన్నే ప్రార్ధించ - నీ దరి చేరాను ||2||
ఆలించరావా - క్షమియించరావా
నీ కృపలో నన్ను నడిపించవా ||పాపిని||
1. ఈ లోక ఆశలు నను చుట్టినా
మృత్యు బంధము పెనవేసినా ||2||
నీ సన్నిధి నుండి నను గెంటివేయకు ||2||
నీ కరుణతో ప్రభు మన్నించవా ||2|| ||పాపిని||
2. నా పాప భారము నను కృంగదీసినా
నా శత్రువు నన్ను వెంటాడినా ||2||
నీవే తప్ప నాకెవరు లేరు ||2||
నా కరము విడువక నడిపించవా ||2|| ||పాపిని||