Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పరమాత్మ నీ పదములు వెదకితి
పాపిగనే నీ శరణము కోరితి ll 2 ll
1 వ చరణం..
నీ పూలదండలో నేనొక పూవునై
నీ రాగ గీతిలో నేనొక స్వరమునై (పర)
2 వ చరణం..
నీ కాలి యందెలో నేనొక మువ్వనై
నీ కాలి ధూళిలొ నేనొక రేణువై (పర)
3 వ చరణం..
నీ దూత గణములొ నేనొక దూతనై
నీ గగన వీధిలో నేనొక తారనై (పర)
4 వ చరణం..
నీ హృదయ వీణలో నేనొక తంతినై
నీ వెలుగు బాటలో నేనొక దీపమై (పర)
5వ చరణం..
నీ జీవ ఊటలో నేనొక బుగ్గనై
నీ ప్రియ వెల్లువలో నేనొక ధారనై (పర)