Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-12
ప: పనికిరాని రాయని పారవేసిన రాయిని ఎత్తుకొని దీవించి
ఇంటి మూలరాయిగా మార్చిన దేవా స్తోత్రము
స్తోత్రం స్తోత్రం యేసు రాజా - నే జీవించుట నీ కృపయేగా ||2||
1. మరణింప నీటిలో వదలివేసిన మోషేను నీవు ఎత్తుకొంటివి
మాటలు రావని పలికిన వ్యక్తితో మహా జాతిని నడిపించితివి
నాలో నీవు ఉన్నావయ్యా నే గొప్ప కార్యములు చేయాలని
నీ కృప ముందు నా భయమెల్ల మాయమగు బుడగలయ్యా
స్తోత్రం స్తోత్రం యేసు రాజా - నే జీవించుటే నీ కృపయేగా ||2||
2. పాప భారము మోయలేక నీపాదం చేరిన మగ్దలేనను
ప్రేమతో నీవు క్షమియించి పుణ్య జీవితం చూపావు
ఎన్నెన్నో కష్టాలు వచ్చినను - నా బ్రతుకును శూన్యం చేయవయ్యా
నారుపోసిన దేవుడా- నీవు నీరుపోయక మానవుగా