Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ప్రేమే జగతికి మూలం
ప్రేమే దైవ స్వరూపం
ప్రేమే నిత్య జీవం
ఆ ప్రేమే మోక్ష మార్గం ||ప్రేమే||
1. అమర్యాదగా నడువనిది
అపకారం చేయనిది
అన్నిటికి తాళునది -అన్నిటికి ఓర్చునది
స్వప్రయోజనం కోరుకొననిది
సత్వరమే కోపపడనిది
మత్సర పడనిది డంబంలేనిది
ఉప్పొంగనిది ప్రేమ ఒక్కటే ||ప్రేమే||
2. దేవుడు మనిషిని ప్రేమించి
తానే మనిషిగ పుట్టాడు
పాపుల పాలిట పరమార్ధముగా
సిలువ మ్రానిపై బలియైనాడు
మనలో మనము ఒకరి కొకరము
ప్రేమ కలిగి జీవించాలి
ప్రేమను మించిన పెన్నిది లేదని
జగమంతా చాటించాలి ||ప్రేమే||