Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Manoj Kumar
Album: జీవశృతి - 5
ప్రభుయేసుని సుమధుర వాక్యం
హృదయాలను మీటిన రాగం
ప్రేమను పంచిన వాక్యం
శాంతి సమతల నాదం
అల్లెలూయ ..... అల్లెలూయ ||2||
1 ఆలకించు వారికి
మంజులగాన సుధామృతము
విశ్వసించు వారికి
రక్షణ జీవ ప్రసాదితము
ఆకలి దప్పిక తీర్చునది....
స్వర్గపు వాకిలి చేర్చునది
ఆలకించు ఆదరించు-
ఆచరించు ఈ వాక్యం
అల్లెలూయ ..... అల్లెలూయ ||2||
2 ప్రార్థనచేయు వారికి
శుభములు గూర్చు సాధనము
వేదనలొందు వారికి
ఊరట గూర్చు స్వాంతనము
దోషము పాపము తీయునది
స్వస్థత జీవం ఇచ్చునది
ఆలకించు... ఆదరించు....
ఆచరించు ఈ వాక్యం
అల్లెలూయ ..... అల్లెలూయ ||2||