Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప్రేమే జగతికి మూలం ప్రేమే దైవ స్వరూపం
ప్రేమే నిత్యజీవం ఆ ప్రేమే మోక్షమార్గం
1 వ చరణం..
అమర్యాదగ నడువనిది అపకారం చేయనిది
అన్నిటిని ఓర్చునది అన్నిటిని తాలునది
స్వప్రయోజనం చూసుకొననది
సత్వరమే కోపపడనిది
మత్సరపడనిది డంబం లేనిది
ఉప్పొంగనిది ప్రేమ ఒక్కటే ప్రేమే
2 వ చరణం..
దేవుడు మనుజులప్రేమించి తానేమనిషిగాపుట్టాడు
పాపుల రక్షణ పరమార్ధముకై
సిలువ మ్రానుపై బలి అయినాడు
మనలో మనము ఒకరికొకరము
ప్రేమకలిగి జీవించాలి
ప్రేమన మించిన పెన్నిధిలేదని
జగమంతా చాటించాలి ప్రేమే