Type Here to Get Search Results !

పండంటి పాపడమ్మ ( padandanti papadamma Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: G. J Ravi Verma 

Music/Tune: Duggirala 

Album: యేసులాలి 3 


ప. పండంటి పాపడమ్మా మనకై పుట్టినాడు 

పశులపాకలో బెల్లేముపురములో 

పండుగ పూలు పూయాలమ్మా 

ప్రతి గుండెలో 

నిండుగ ఆడి పాడాలమ్మ 

ఊరు వాడలూ 


1. చల్లని పూటా మెల్లని మాట వినగానే 

కల్లలు లేని గొల్లలు వేవేగ వచ్చారు 

చక్కని చుక్క నడిచే తారను కనగానే 

ఎల్లలు దాటి జ్ఞానులు ముగ్గురు వచ్చారు 

అన్నన్నా నిజమన్నా 

ఈ రాజే మన రాజంటూ

బాలయేసుని గాంచి వారు సంతసించారూ

పరుగున వచ్చి కానుకలిచ్చి 

ముక్తిని పొందారు ||ప|| 


2. మనకోసం యిలలో పుట్టిన మరియమ్మ సుతుని 

మనసుతో నమ్మికబూని ఆరాధించుదాం 

కష్టాలు కడతేర్చు ఇష్టాలు ఈడేర్చు

లోపాలు కడిగేసి పాపాలు మన్నించు 

అన్నన్నా రారన్నా రక్షకుడు రారాజు 

బాలయేసుని గాంచి 

మనమూ సంతసించుదాం 

పరుగున వచ్చి కానుకలిచ్చి 

ముక్తిని పొందుదాం ||ప|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section