Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సా. రజతోత్సవం - దైవ సేవ యాజకత్వఉత్సవం
ధరణియందు మానవాళి అంజలీ... మరియాంజలి
ప|| రజతోత్సవం - సుజనోత్సవం
దైవ పిలుపునందుకున్న మహోత్సం
పాతిక వసంతాలు ప్రభు సేవలో ||2||
పండిన జూబిలీ... నిండిన జూబిలి ||2||
రజత జూబిలీ ఉత్సవాల
స్వాగత సమయం
క్రీసు యాజకత్వ సేవయందు
పుణ్యజీవితం
రండీ పాల్గొందము
ప్రభు యేసు బలివిందులో ||2||
ప్రభు యేసు బలివిందులో
1. మెల్కిసేదేకుని యాజక క్రమమున
దైవాభి షేకము అరుదెంచగా
ప్రభుయేసువే ప్రధానార్చకుడిగా
అందించెను గురువును మన కాపరిగా
సత్య శ్రీ సభలోని విశ్వాస బీజమును
ఫలియింపజేయుమని దీవించెనుగా
||రజత జూబిలీ ఉత్సవాల||
2. లోక రక్షణార్థమై దైవ సుతుడు యేసుక్రీస్తు
ఇమ్మానుయేలుగా జీవించెనుగా
కడవిందులో బలివిందులో
యాజకత్వ సేవను స్థాపించెనుగా
భూమి దిగంతముల వరకు
దైవవాక్కు ప్రకటించి
ఫలియింపజేయుమని దీవించెనుగా
||రజత జూబిలీ ఉత్సవాల||