Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి: జీవిత దేవుని కీర్తించ ప్రాణ ప్రియుని ప్రార్థింప
రండి ... రండి... దేవుని సన్నిధికి
ప : రండీ ఈ శుభవేళ -
దేవుని సన్నిధికి
జీవిత దేవుని కీర్తించ
ప్రాణ ప్రియుని ప్రార్థించ ||2||
1. ఇద్దరు ముగ్గురు కూడినచోట -
నింపును తన సన్నిధిన ||2||
మనస్సును మందిరముగ మలిచి-
మదిలో యేసుని రూపము నిలిపి
ధూప దీప ఆరాధనతో -
స్తోత్ర గీతిక మాలికతో
ప్రభు సన్నిధికి చేరుదము -
ప్రభు దీవెనలు పొందుదము ||2||
2. హృదయ ద్వారము చెంతన నిలచి
పిలుచుచున్నాడు ఘన దేవుడు
హృదయము తెరచిన ప్రతివానిలో
వెలిగించును నూతన దీపం
ప్రేమశాంతి ఆనందముతో
నవ్యజీవిత సౌఖ్యముతో
ప్రభు సన్నిధికి చేరుదము
ప్రభుదీవెనలు పొందుదము ||రండి||