Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యెషయా ప్రవచించే...ఇమ్మానుయేలనీ
యిర్మియా ప్రకటించే... సత్యానువర్తియనీ ||2||
మీకా ఎరిగించే బెల్లెహేము వాసియని
హోషియా తెలిపెను ప్రేమామయుడని ||2||
ప్రవచించిన రక్షకుడు జన్మించె బాలయేసుగా
తారక నింగిలో ఉదయించే
దూతలు వార్తను ప్రకటించే
వాక్యమే నరావతారియై-మన కొరకై జన్మించే
రండీ వేగమే రారండీ చూసి ఆనందించండి
రండీ వేగమే రారండీ చూసి తరియించండి ||యెషయా||
1. దేవునిగా తనకున్న మహావైభవము వదిలి
వినయముతో ప్రేమతో
మానవ రూపము దాల్చి ||2||
ఏతెంచెను మన రక్షకుడు ఇమ్మానుయేలుగా
ఉదయించెను ఈ భువిలో బాలయేసుగా ||2||
||తారక నింగిలో||
2. మనమంతా మదిలోని అహంభావమును వీడి
సమభావముతో అందరము
ప్రభు సన్నిధికి చేరెదము ||2||
గొల్లలు జ్ఞానులవలె మనము ఆరాధించెదము
పూజించెదము మనమంతా
పవిత్ర హృదయముతో ||2||
||తారక నింగిలో||