Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. యేసు ఒక్కడే ఈ లోక రక్షకుడు
క్రీస్తు ఒక్కడే సజీవ దేవుడు
నమ్మదగిన దేవుడు రక్షించే దేవుడు
ప్రాణ మిత్రుడు మనతో ఉండే దేవుడు
హల్లెలూయ హల్లెలూయ ||2||
1. పరలోక తండ్రికి ప్రియమైన పుత్రుడు
కన్య మరియ గర్భాన
జన్మించిన రక్షకుడు ||యే||
2. దేవుని చెంత నున్న ఆదిలోన వాక్యము
ఈ భువిలో వెలసిన
మానవ రూపము ||యే||
3. సర్వలోక సృష్టికి మూలము-ఆధారము
ఆయనే జీవము నిజమైన ప్రకాశము ||యే||