Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జోల పాట పాడనా బాలయేసుకు
ముద్దులొలికె బాలునికి జోలపాడనా ||2||
చిన్నారి నా యేసయ్యా-చక్కనైన నాతండ్రీ ||2||
నా కోసం వచ్చావా పరము వీడి
యేసయ్యా ||2||
జో..లాలి.. జో..జో..లాలీ.. జో.. ||2|| ||జోల||
1. విశ్వమంత నిను చూసి
పరవశించి పోయింది
తారలన్ని నిను చూసి
సంబరాలు చేసాయి ||2||
పరము నుండి దూతలు
స్తుతి గీతం పాడగా ||2||
భువిలోని జనులంతా జోలపాట పాడారు ||2||
జో..లాలి..జో..జో..లాలీ.. జో.. ||2|| ||జోల||
2. ఇమ్మానుయేలుగా జనియించిన దైవమా
ఆహ్వానమయ్యా-ఆనంద హృదయంతో ||2||
ఓ శాంతి దూత-పరలోక నాధా ||2||
నరరూపధారీ - నీకే స్తోత్రం ||2||
జో..లాలి.. జో..జో..లాలీ.. జో.. ||2|| ||జోల||