చింతలేదిక యేసు పుట్టెను - వింతగను బెత్లహేమందున
చెంత జేరను రండి సర్వ జనాంగమా సంతసమొందుమా
1 వ చరణం..
దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నాదివనంబు వింతగా
ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి - స్తుతులొనరించిరి
2 వ చరణం..
చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని
గనుగొన చక్కగా బెత్లముపురమున జొచ్చిరి - కానుకలిచ్చిరి
3 వ చరణం..
కన్య గర్భము నందు బుట్టెను కరుణగల రక్షకుడు
క్రీస్తు ధన్యులగుటకు రండి వేగమె దీనులై సర్వమానవల్
4 వ చరణం..
పాపమెల్లను పరిహరింపను - పరమరక్షకుడవతరించెను
దాపు చేరిన వారి కిడుగడు భాగ్యము మోక్ష భాగ్యము