Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఎదిగే వయస్సుకు వివాహం -
పెరిగే ప్రేమకు దాంపత్యం
పరిపూర్ణతను ప్రసాదించు -
వీడని బంధమై వికసించు
1. ఒకే రోజుకు ఒక ఉదయం -
ఒకే పెళ్ళికి - ఒక దాంపత్యం
ఇది ప్రకృతి చెప్పే పాఠం -
ఇది చరిత్ర చాటే సత్యం సత్యం
2. ఒకరికొకరు ఇల దివ్యవరాలై -
విడిపోని స్నేహ దీపకాంతులై
చక్కటి సంతాన - శాంత గృహమై -
నిశ్చంతగా సాగు సంసారం
3. రవిని విడిపోదులే వెలుగు -
క్రీస్తుని విడిపోలేదులే శ్రీసభ
మరి విడిపోయి మనగలరా -
దేవుడు కలిపిన దంపతులు