Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
ఏమివ్వగలను యేసయ్యా - ఏమి లేదే ప్రభూ నాదంటు
నాదన్న దంతయు నీదే - నే జీవించడం నీ కృపయే... ||2||
1 వ చరణం..
తల్లి గర్భములో - నే ఉన్నప్పుడు
రూపము నిచ్చిన - తల్లివి నీవే ||2||
ముక్కు రంధ్రములో - ప్రాణ వాయువు
ఊది జీవము నిచ్చిన - తండ్రి నీవే .. ||2||
వందనము ||3||
ప్రభూ వందనముllఏll
2 వ చరణం..
ఈ లోకం దాని వ్యామోహము-
నా ముందే గతించి పోవును ||2||
కాని నీవిచ్చిన ఆత్మవరము -
నాలో జీవమై వికసించును
వందనము ||3||
ప్రభూ వందనముllఏll