Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఏమివ్వగలను దేవా నీ పాద పూజకు -
ఏమివ్వగలను దేవా బలి పూజకు-2
నా సర్వం నా సకలం నీవై యుండగా -
నేనేమివ్వగలను దేవా పరమ పూజకు
1. నాలోని లోపాలు లెక్కించిన దేవా -
నే నిలువగలనా నీ సన్నిధిలో
నాకున్న సర్వస్వం నీ దానములేగా -
అర్పింతు దేవా స్వీకరించుమా
2. అప్ప ద్రాక్షరసములు ఈ భూమి ఫలములు -
అర్పించగ తెచ్చాను నీ సన్నిధికి
నాకున్న సంపదయే ఈ లేమి జీవితం -
స్వీకరించుము దేవా నా హృదయ కానుక