Type Here to Get Search Results !

ఎంతో వింత యెంతో చింత ( entho vintha yentho chintha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. ఎంతో వింత యెంతో చింత 

యేసునాధు మరణమంత 

పంతముతో చేసిరంత

సొంత ప్రజలు స్వామినంత


1. పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టి

యేసునాధు నకటా 

అట్టి శ్రమల నొందిపలుకడాయే

యేసుస్వామి నాడు ||ఎ|| 


2. మొయ్యలేని మ్రాను నొకటి '

మోపిరేసు వీపు పైని 

మొయ్యలేక మానితోడ మూర్చపోయే 

యేసుతండ్రి ||ఎ|| 


3. కొయ్య పైనే సెయ్యన్ బెట్టి

కాలు సేతులలో చీలల్ 

గొట్టి కఠినులంత గూడి కొట్టిరి

ఘోరముగా క్రీస్తునుబట్టి ||ఎ|| 


4. దాహము గొన జేదు చిరక

ద్రావ నిడిరి ద్రోహులకటా

ధాత్రి ప్రజల బాధాకోర్చి

ధన్యుడా దివికేగె నహహా ||ఎ|| 


5. బల్లెముతో ప్రక్కన్ పొడవన్

బారెనీరు రక్తమహహా 

ఏరై పారే యేసు రక్తమెల్ల 

ప్రజల కెలమి నొసగు ||ఎ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section