Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఎవరూ లేక ఒంటరినై – అందరికి నే దూరమై అనాధగా నిలిచాను
రావా యేసయ్యా - నీవు రావా యేసయ్యా ll 2 ll
1 వ చరణం
స్నేహుతులని నమ్మాను – మోసం చేసారు
బంధువులని నమ్మాను – ద్రోహం చేసారు ll 2 ll
దీనుడనై అంధుడనై - అనాధగా నే నిలిచాను ll 2 ll ll నీవు రావా ll
2 వ చరణం
నేనున్నా నేనున్నా అని అందరూ అంటారు
కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు ll 2 ll
దీనుడనై అంధుడనై - అనాధగా నే నిలిచాను ll 2 ll ll నీవు రావా ll
3 వ చరణం
చిరకాలం నీ ప్రేమ – కలకాలం వుండాలి
శాశ్వతమైన నీ ప్రేమ - కలకాలం వుండాలి ll 2 ll
దీనుడనై అంధుడనై - అనాధగా నే నిలిచాను ll 2 ll ll నీవు రావా ll