Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: ఎక్కడ ఎక్కడ నా ప్రభువు ఎక్కడ ||2||
సుగంధపరిమళ తైలము పూయ
నా ప్రభుదేహము ఎక్కడ ||2||
లేనేలేడు రానే రాడు ఇకపై
ఆయన మృతులలో ||2||
సజీవుడైన దేవుని
నేడు మృతులలో వెదకెదరా ||2||
స్తోత్రము మహిమ
కీర్తి ఘనత మృత్యుంజయా
యుగయుగములకు గలుగును గాక
మృత్యుంజయా ||2||
మృత్యుంజయా హల్లేలూయా ||2||
హల్లేలూయా ||4||
1. ఇపై మరణము దుఃఖము
కాదు నిత్యానంద ద్వారమే ||2||
మృతులైన వారలు మరలా లేతురని
నమ్మినవారిక ధన్యులు ||స్తోత్ర||
2. పరలోక రాజ్యమె శాశ్వత రాజ్యం
మన అందరికీ ఆశాదీపం ||2||
పరలోకముపై నీ దృష్టి నిలిపి
సాగించు విశ్వాస పయనం ||2|| ||స్తోత్ర||
3. జరుగువదేమో జరుగునుకాని
మరణము తప్పక నీదరి చేరును ||2||
కృంగి కృశించి నశియించక
ప్రభువును నమ్మి జీవింపుము ||2|| ||స్తోత్ర||