Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఇంపుగా పుడమి నాయకీ!
కృపాకరీ దయాపరీ-సొంపులగా మనవి
నాలకింపవమ్మ వేగశ్రీ ||2||
1. పాపినంచు కోపగించకే పవిత్ర నాయకీ
ప్రాపగోరి యున్నవాడ పాపదీసి బ్రోవుశ్రీ ||ఇ||
2. నేర మెంచకే మన్నించవే రక్షింపవే యమ్మా
మేరమీర తారతిమ్మా చారుగాత్రి బాలశ్రీ ||ఇ||
3. నీవే భక్తి పాలకివైన దేవినంచు వేడగా
దేవమాత రావదేల గావగనన్ను వేగశ్రీ ||ఇ||
4. నిన్ను వేడ బ్రోవకుండ నెన్నడైన నుండినా
సన్ను తాంగి భారమేమి నన్ను గరుణ జూడశ్రీ ||3||