Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: ఆరనిప్రేమ
ప. కరుణించరావా దేవా ఈ పాపిని,
దీవించరావా దేవా నీ దాసుని
నను కాపాడే నాధుడవు-నను
పాలించే రారాజువు
జీవ ఊటమైన నిన్ను నేను మరిచితిని
ప్రేమమయుడవయిన నిన్ను
నీ ప్రేమను మరచితిని ||క||
1 నీ ప్రేమకు దూరమైతిని సాతానుని
ఆశ్రయించితిని రావా నా దేవా
పాప భారముతో క్రుంగిపోతిని
చేయూతనిచ్చి నన్ను నడిపించవా
నా దోషములను మన్నించవా ||క||
2 శోధన వేదనల సుడిగుండాలు
దోష బ్రతుకు నన్ను నిరాశ పరచినది ||2||
రా నా దేవా నా హృదిలో ప్రవేశించవా ||2||
నీ రక్తంచే నన్ను పరిశుద్దిని చేయవా
నీవే నాకు శరణం దేవా ||క||