Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
దైవసంఘ సభ్యులారా తపోకాల మిదేనండి
ముక్తినొందు తరుణమండి దీక్షబూని సాగిరండీ
1 వ చరణం..
తరతరాల నుండి వచ్చు సంప్రదాయ మిదేనండి
ఉపవసించుదాము రండి
నాల్గుపదుల రోజులండి ||2|| ||దైవ||
2 వ చరణం..
పూర్వవేదమందు మోషే భక్త ఎలియా తెలిపినారు
క్రీస్తుప్రభువు చూపినారు
తపస్సుచేయు తీరు మనకు ||2|| ||దైవ||
3 వ చరణం..
అన్నపాన విలాసాలు ఆటపాట వినోదాలు
మాటలన్నికట్టిపెట్టి
ప్రభువు వెంట సాగుదాము||2|| ||దైవ||
4 వ చరణం..
ఈ పవిత్ర కాలమందు తపోఫలములందుకొనగ||2||
దీవెనిచ్చి కావుమంటు
త్రిత్వ దేవు వేడుదాము ||2||
త్రిత్వ దేవు వేడుదాము ||దైవ||