Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. జీవన దాత లాలిజో మానవరూప లాలిజో
దివికి భువికి వంతెన నీవేగా
దూతలు తెలిపిన నిజమైన ప్రభు
చీకటి దారికి వరమై నన్ను
నూతనంగా నిలిపిన ధన్యత
నీదేలే దేవాది దేవా లాలిజో ||జీ||
1. ఆదిలోన జీవవాక్యం నీవేనయ్యా
ఆ వాక్కు మనుజుడైనది నీవేనయ్యా
దిగంతాలు వ్యాపించి వసంతాలు
పూయించే ఇమ్మానుయేలా
లాలిజో దేవాది దేవా లాలిజో
2. లోకానికి వెలుగై వచ్చిన
నిజదైవమా మనుజాళికి
రక్షణ మార్గం నీవేనయ్యా
దీవెనలు కురిపించి దీనులను రక్షించే
కరుణామయా లాలిజో దేవాది దేవా లాలిజో