Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. జీవితమన్నది నీటి బుడగరా..
ఓ మనిషి నీ కిది తెలుసా మరణానికి
తరుణంలేదు వయసు పెరుగు చున్నది
ఆయుషు తరిగిపోవుచున్నది
కరుణామూర్తి యేసు ప్రేమ తెలుసుకో
కష్టాలను కడుగుకొనే మోక్ష పథాన చేరుకో
జీవిత మన్నది నీటి బుడగరా
ఏదో ఒక నాడది పగిలి పోవురా
ఆశల ఆరాటంలో పోరాటంరా
బంధాల సందడిలో బంధీవిరా ||జీ||
1. మేడల యజమానుడవైనా
వాడ వాడలా ఖ్యాతి మారుమ్రోగినా ||2||
సుఖాలన్నీ నీకు అసహ్యమైనప్పుడు
తోడు రారు తోడు నిలతు మోసపోకు నేస్తమా
ఎందుకు ప్రయాస ఓ సోదరా!
ఎందుకు ప్రయాస ఓ సోదరీ
ముందే ఏసుకు హృదయం అర్పించవా ||జీ||
2. నీ సాధన శోధనగా మారినప్పుడు
ఆశలే నిరాశలై పోయినప్పుడు
కీడు పొంచియున్న పాపలోకము
క్రీస్తు ఇచ్చు శాంతిని గుర్తించలేనప్పుడు
ఎందుకు ప్రయాస ఓ సోదరా
ఎందుకు ప్రయాస ఓ సోదరీ
ముందే ఏసుకు హృదయం అర్పించవా ||జీ||