Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని
నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా
1:-
ఎన్ని యాటంకంబులున్నను – ఎన్ని భయములు కల్గిన
అన్నిపోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షకా ll జీ ll
2:-
అన్నివేళలా నీవు చెంత నున్న అనుభవ మీయవే
తిన్నగా నీ మార్గమందున పూనినడచెద రక్షకా ll జీ ll
3:-
నేత్రములు మిరుమిట్లు గొల్పెడు – చిత్ర దృశ్యములెన్నియో
శతృవగు సాతాను గెల్వను – చాలునీ కృప రక్షకా ll జీ ll
4:-
నాదు హృదయమునందు వెలుపల ఆవరించిన శత్రువులన్
చెదరగోట్టుము రూపుమాపుము శీఘ్రముగ నా రక్షకా ll జీ ll
5:-
మహిమతో నీవుందు చోటికి మమ్ము చేర్చేదనంటివీ
ఇహము దాటినా దాక నిన్ను వీడనంటివి రక్షకా ll జీ ll
6:-
పాప మార్గము దరికి పోవక – పాత ఆశలు కోరక
ఎప్పుడు నిన్నే వెంబడింపను కృప నొసంగుము రక్షకా ll జీ ll