Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి: హే ఇహపరంబుల కర్త - దేవాది దేవా
కన్య సుధా శ్రీ యేసునాధా
పిత సుతానుబంధ పవిత్రాత్మ
శరణం శరణం శరణం
ప: మనోజ్ఞ మంగళ కోవెలలో
పరవశమొందగ రారండి ||2||
మంగళహారతి పట్టండి ||2||
మానస పూజలుచేయండి
1. ఆమని పూసిన తరుణంలో
కోయిల తీయగా పాడగా ||2||
ప్రభువు పిలుపు వినిపించింది ||2||
నా మనసే పులకరించింది.
2. గమ్యము కానక తిరిగే వేళ
చీకటి మాటున నడిచేవేళ ||2||
స్వామి చల్లగా పిలిచాడు
చేయిపట్టుకు నడిపాడు
3. ప్రభు పిలిపే పాలిటి వరమని
జీవన మధురిమ చిలికే మార్గమని ||2||
తలచి నమ్మితి చేరితి సేవ ||2||
చేసెద నీకు జీవితాంతము