Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: అలయ గంటలు
సాకి మ్రోగుచున్నవి గుడి గంటలు
వినరే రారే ప్రియ సంఘమా...
ప: ప్రేమకు నెలవు మా దేవుని కొలువు
ఆమని పిలుపు మా దేవుని పిలుపు
వడి వడి నడకల... సరియగు విధమునా...
దేవుని చెంతకు రారే ప్రేమను పొందను.
మన దేవుని చెంతకు రారే ప్రేమను పొందను
చంద్రోదయం... ప్రేమ చంద్రోదయం ||2||
చంద్రోదయం...దైవ ప్రేమ చంద్రోదయం
పాగగగ గరగగ రిగరి సరిసా నిరిససపా
గపదస గపదసరిగా
1. నీతి వస్త్రము నీవు ధరించుము
యేసుని చూడగను నిండుమనసుతో
నీవరుదెంచుము యేసుని కొలవగను ||2||
ధవళ వస్త్రమునా దూత బృందమునా
ఆఆఆఆఆ...........
దేవదేవుడు దేవుని పుత్రుడు దిగిరానున్నాడు
నింగి నుండి దిగిరానున్నాడు
అభివందనం.... దేవా అభివందనం
అభివందనం.... యేసు దేవా అభివందనం
సానిసాని పగప నిరిసని
సనిసగాపరి నింపపగా ||2||
2. ఆదివారము మన ప్రభుదినము
మరువకు సోదరా అనుదిన ప్రార్థన
ఆ ప్రభు మెచ్చును దీవెన లిచ్చునులే
ఆలయ గంటలు మ్రోగుచున్నవి
ఆఆఆఆఆ ||2||
అదిగదిగో దేవుని పిలుపు రమ్మనుచున్నాడు
యేసు నిన్ను రారమ్మనుచున్నాడు అరుణోదయం...
ప్రేమ అరుణోదయం అరుణోదయం..యేసు ప్రేమ అరుణోదయం