Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. హోసన్న...హోసన్న... ||2||
రాజాధి రాజైన క్రీస్తేసుని స్మరియించుమా ||2||
క్రీస్తేసే ఈలోక రక్షకుడు ||హోసన్న|| ||4||
1. ఈ యేసే ఇమ్మానుయేలు
ఎల్లవేళల నీతోడుండున్
నీ మార్గములన్నింటి యందు
ఆ ప్రభువే తోడై యుండున్
యేసే నజరేయుడు యేసే గలిలయుడు
యేసే స్తుతి పాత్రుడు - యేసే అభిషిక్తుడు
ఆ ఇమ్మానుయేలును స్మరియించుమా ||హోసన్న|| ||4||
2. ఈ యేసే జీవాధిపతి నిత్య జీవమునిచ్చును
నిరతం తన జీవపు వాక్కులచే
జీవ జలమును అందించును
యేసే జీవం యేసే మార్గం
యేసే సత్యం యేసే సర్వం
ఆ జీవాధిపతిని స్మరియించుమా ||హోసన్న||