Song Lyrics in Telugu
నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నాప్రాణము దప్పిగొనుచున్నది
నా ప్రాణమా నా సమస్తమా - ప్రభుని స్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా
1.
పనికిరాని నన్ను నీవు పైకిలేపితివి
క్రీస్తనే బండపైన నన్నునిలిపితివి (2)
నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు
నే వెంబడింతు ప్రభు "నాప్రాణమా"
2.
అంధకారపు లోయలలో నేను నడచితిని
ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి (2)
కంటి పాపగ నీవు నన్ను కాచితివి
కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను
ఇలలో నిన్ను కొలిచెదను "నాప్రాణమా"
3.
నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు
ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలియింతును (2)
నీవు చేసిన మేళ్ళను నేనెట్లు మరతు ప్రభు
నీ కొరకు నే సాక్షిగ ఇలలో జీవింతును
నే ఇలలో జీవింతును "నాప్రాణమా"
Song Lyrics in English
Neeti Vaagula Koraku Duppi Aashinchunatlu
Nee Koraku Naapranamu Dappigonuchunnadi
Naa Praanama Naa Samasthama - Prabhuni Stuthiyinchumaa
Naa Yesu Chesina Melalu Neevu Maruvakumaa
1.
Panikiraani Nannu Neevu Paikilepithivi
Kristhane Bandapaina Nannunilipithivi (2)
Naa Adugulu Sthiraparachi Balamu Nichchithivi
Needu Adugu Jaadale Vembadintu Prabhu
Nee Vembadintu Prabhu "Naapranama"
2.
Andhakaarapu Loyalalo Nenu Nadachithini
Ae Apaayamu Raakunda Nannu Nadipithivi (2)
Kanti Paapaga Neevu Nannu Kaachithivi
Kanna Tandhrivi Neevani Ninnu Kolicheddanu
Ilalo Ninnu Kolicheddanu "Naapranama"
3.
Needu Aathmatho Ninduga Nannu Ninpu Prabhu
Aathma Phalamulu Dandiga Neekai Phaliinthuni (2)
Neevu Chesina Melalu Nenenetlu Marathu Prabhu
Nee Koraku Nee Saakshiga Ilalo Jeevintunu
Nee Ilalo Jeevintunu "Naapranama"