Song Lyrics in Telugu
యెహోవా నాబలమా - యదార్ధమైనది నీ మార్గం
పరి పూర్ణమైనది నీ మార్గం - యెహోవా....ఆ..ఆ
నా శత్రువులు నను చుట్టినను - నరకపు పాశము లరికట్టినను
వరదవలె భక్తిహీనులు పొర్లిన - వదలక నను ఎడబాయి దేవా "యెహోవా"
మరణపుటురులలో మరువక మొరలిడ - ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై
తన ఆలయములో నా మొర వినెను - అదరెను ధరణి భయకంపముచే "యెహోవా"
నాదిపమును వెలిగించువాడు - నా చీకటిని వెలుగుగా జేయును
జలరాశుల నుండి బలమైన చేతితో - వెలుపల జేర్చిన బలమైన దేవుడు "యెహోవా"
పౌరుషముగల ప్రభు కోపించగ - పర్వతములపునాదులు వణికెను
తన నోటనుండి వచ్చిన అగ్ని - దహించి వేసెను వైరులనెల్ల "యెహోవా"
మేఘములపై ఆయన వచ్చును - మేఘములను తన మాటుగ జేయును
ఉరుములు మెరుపులు మెండుగ జేసి - అపజయమిచ్చును అపవాదికిని "యెహోవా"
దయగల వారిపై దయచూపించను - కటినుల యెడల వికటముజూపును
గర్విష్టులయెక్క గర్వముననచును - సర్వము నెరిగిన సర్వాదికారి "యెహోవా"
నా కాళ్లను లేడికాల్లగజేసి - ఎత్తైన స్థలములలో శక్తితో నిలిపి
రక్షణ కేడెము నాకందించి - అక్షయముగ తన పక్షము జేర్చిన "యెహోవా"
యెహోవా జీవముగల దేవా - బహుగా స్తుతులకు అర్హుడవు నీవే
అన్యజనులలో ధన్యత చూపుచు - హల్లెలూయ స్తుతిగానము జేసెద "యెహోవా"
Song Lyrics in English
Yehova Naabalama - Yadaradhmainadi Nee Margam
Pari Poornamainaadi Nee Margam - Yehova....A..A
Naa Shatrulu Nanu Chuttinanu - Narakapu Paashamu Larikattinanu
Varadavale Bhaktihinulu Porlina - Vadalaka Nanu Edabayi Devaa "Yehova"
Maranaputurulalo Maruvaka Moralida - Unnatha Durgamai Rakshana Shrungamai
Tana Aalayamulo Naa Mora Vinen - Adarena Dharani Bhayakampamuchhe "Yehova"
Naadipamunu Veliginchuvadu - Naa Cheekatini Veluguga Jeyunu
Jalarashula Nundi Balamina Chethito - Velupala Jeyarchina Balamina Devudu "Yehova"
Paurushamugala Prabhu Kopinchaga - Parvathamulapunaadulu Vanikenu
Tana Notanundi Vachina Agni - Dahinchi Vesenavi Vairulanella "Yehova"
Meghamulapai Aayana Vachchunu - Meghamulanu Tana Maatuga Jeyunu
Urumulu Merupulu Menduga Jesi - Apajayamicchunu Apavaadikinni "Yehova"
Dayagala Vaaripai Dayachoopinchanu - Katinula Yedala Vikathamoojupunu
Garvishtulayeekka Garvamanachunu - Sarvamu Nerigina Sarvadhikaari "Yehova"
Naa Kaalalu Ledikallagajesi - Eththaina Sthalamulolo Shakthitho Nilipi
Rakshana Kaedamu Naakandichina - Akshayamuga Tana Pakshamu Jeyrchina "Yehova"
Yehova Jeevamagala Devaa - Bahuga Stutulaku Arhudavoo Nevee
Anyajanulalo Dhanyata Choopuchu - Halleluya Stutigaanamu Jeseda "Yehova"