ఆ.....ఆ.....ఆ.....ఆ.....ఆ.....
జీవస్వరం ఇది యేసు స్వరం
జీవమునిచ్చే దివ్యస్వరం ||2||
స్వర్గ స్వరం శ్రీయేసు స్వరం
పరమ పవిత్రుని మధుర స్వరం
హల్లెలూయ..... హల్లెలూయ....
1. ఆదిలో వాక్కు జీవమై వేంచేసిన జీవస్వరం ||2||
హృదయ కోవెలలో ఇమ్మానువేలై
దివిని వీడి భువికి దిగిన యేసుని జీవస్వరం
అంతరాత్మలో నింపుదాం ఈ జీవస్వరం ||2||
హల్లెలూయ...... హల్లెలూయ....... ||2||
2. వ్యాధి బాధలను తొలగించి బలపరచే జీవస్వరం
బలహీన సమయములో బలమును ఒసగి
హృదినితాకి ప్రేమతో నింపే తియ్యనైన జీవస్వరం
అంతర్మాతో నింపుదాం ఈ జీవస్వరం ||2||
హల్లెలూయ......హల్లెలూయ....... ||2||